కులగణన సర్వేపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ . తమ సర్కార్ నిర్వహించిన సర్వేను ఏ ప్రాతిపదికన తప్పు పడతారంటూ ప్రశ్నించారు. బీసీల కులగణన జరగాలని పునాది వేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన ప్రతి రాష్ట్రంలో కులగణన గురించి డిమాండ్ చేశారని గుర్తు చేశారు.