ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో వక్ఫ్ చట్టాన్ని తిరస్కరిస్తున్నామని ముస్లింల సోమవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత (రెవెన్యూ) కు వినతిపత్రం సమర్పించారు. జగిత్యాల జమ మజీద్ నుండి క్లాక్ టవర్ మీదుగా ర్యాలీలో వేలాది ముస్లింల సమూహం గా ప్లకార్డులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.