పాకిస్థానీయులను దేశం నుంచి పంపాలి
NEWS May 05,2025 04:20 pm
అక్రమంగా నివసిస్తున్న పాకిస్థానీయులను దేశం నుండి బహిష్కరించాలని మల్యాల ఎమ్మార్వో ఆఫీసులో ఆర్ఐ రాణికి మల్యాల మండల బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ గడువు ముగిసిన వీసాలు కలిగి ఉండి, వీసాలు సస్పెండ్ చేయబడిన పాకిస్తాన్ దేశస్థులను వెంటనే గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, మండలాధ్యక్షుడు గాజుల మల్లేశం, వెంకటస్వామి యాదవ్, గంగాధర్, శ్రావణ్, సురేష్, జీవన్, గౌతమ్, చక్రం, మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.