72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది హైదరాబాద్. ఇప్పటికే వివిధ దేశాల నుంచి అందగత్తెలు వస్తున్నారు. వీరంతా శంషాబాద్ బాట పట్టారు. తాజాగా మిస్ వరల్డ్ పోటీల కోసం పాల్గొనేందుకు గాను మిస్ పోర్చుగల్ అమేలియా బాప్టిస్టా ఆంటోనియో విచ్చేశారు. ఆమెకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో స్వాగతం పలికారు.