కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భోళా మనిషి
NEWS May 05,2025 12:42 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. తను బోళా మనిషి అని, ఎవరితోనైనా, ఎక్కడికైనా వెళ్లి పని చేసుకుని వస్తాడన్నారు. గత ప్రభుత్వం ప్రధాని మోడీని, బీజేపీని తిట్టడం వల్ల తెలంగాణ వెనుక బడిందన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, ఎన్నికల తర్వాత రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యం అని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి రాజీవ్ రహదారి కాంట్రాక్టర్ సమస్య పరిష్కరిస్తే దానిని జాతీయ రహదారిగా తీర్చిదిద్దుతామని కోమటిరెడ్డికి మాటిస్తున్నానని అన్నారు బండి.