శ్రీతేజ్‌కు అల్లు అరవింద్, వాసు పరామర్శ
NEWS May 05,2025 12:23 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చికిత్స పొందుతూ కోలుకున్న శ్రీ తేజ్ ను పరామర్శించారు నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఇటీవల కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ లో చేరాడు శ్రీతేజ్. ఘటన జరిగినప్పటి నుంచి శ్రీ తేజ్ యోగ క్షేమాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. తను మామూలు జీవితం గడిపేంత వరకు తాము అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. ఈ సందర్బంగా నిర్మాతలతో పాటు నటుడు బన్నీ కూడా వాకబు చేశాడు.