ప్రపంచ 72వ అందాల పోటీలకు వేదిక కానుంది హైదరాబాద్. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ సర్కార్. ఐజీ స్టీఫెన్ రవీందర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎక్కడ చూసినా పోలీసులను మోహరించారు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్. అందాల పోటీలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చింది.