టాలీవుడ్ నిర్మాత రామారావు కన్నుమూత
NEWS May 05,2025 07:03 am
టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత జవ్వాజి వెంకట రామారావు మృతి చెందారు. ఆయన కొంత కాలం నుంచి లివర్ సమస్యతో బాధ పడుతున్నారు. 1990లో తేనటీగ, ప్రేమ అండ్ కో, బడి, బొబ్బిలి వేట సినిమాలు తీశాడు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ తో మూవీస్ తీయడం విశేషం. తనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.