పాకిస్తాన్ తో యుద్దానికి సిద్దం
NEWS May 05,2025 06:41 am
భారత, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ కావాలని భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోందన్నారు. ఇక ఇంత కాలం ఉపేక్షించామని, కానీ ఇప్పుడు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యామని ప్రకటించారు. పాకిస్తాన్ కు నేరుగా యుద్దం చేసేందుకు సిద్దమయ్యామని స్పష్టం చేశారు. దీంతో రాజ్ నాథ్ సింగ్ చేసిన తాజా ప్రకటన కలకలం రేపుతోంది.