కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 206 రన్స్ చేసింది. ఆండ్రూ రస్సెల్ , రహాన్ రాణించారు. అనంతరం మైదానంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ చివరి బంతి దాకా పోరాడింది. ఆదిలోనే అభినవ్ వికెట్ ను కోల్పోయింది. జైశ్వాల్ రాణించగా హెట్ మెయిర్ కొంత పర్వాలేదనిపించాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ సూపర్ షో చేశాడు. సిక్సులు ఫోర్లతో విరుచుకు పడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సెంచరీ మిస్ అయ్యాడు. 94 రన్స్ చేశాడు. ఆఖరున శివమ్ దూబే మైదానంలో ఉన్నా గట్టెక్కించ లే క పోయాడు.