కేంద్రం నిర్ణయం చారిత్రాత్మకం
NEWS May 04,2025 05:41 pm
దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు ఎంపీ ఆర్. కృష్ణయ్య. స్వాతంత్రం వచ్చిన తర్వాత కుల గణన చేసేందుకు ఎవరూ ధైర్యం చేయలేదన్నారు. మోడీ ధైర్యానికి బీసీ సమాజం తరపున కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని అన్నారు. తన సారథ్యంలో మోడీ శకం మొదలైందన్నారు. భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు.