రెచ్చి పోయిన రస్సెల్ కోల్ కతా బిగ్ స్కోర్
NEWS May 04,2025 05:12 pm
ఐపీఎల్ 2025లో భాగంగా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోర్ సాధించింది. రఘువంశీ, అజింక్యా రహానే రాణించగా మైదానంలోకి దిగిన ఆండ్రూ రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 25 బాల్స్ ఎదుర్కొని 57 రన్స్ చేశాడు. 4 ఫోర్లు 6 సిక్సర్లు కొట్టాడు. ఫోర్లు , సిక్సర్లతో 52 రన్స్ పిండుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ముందు 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రింకూ సింగ్ 5 బాల్స్ ఎదుర్కొని 15 పరుగులు చేశాడు.