ప్రముఖ గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద కన్నుమూశారు. వారణాసిలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. శివానంద మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శివానంద మృతి యోగా రంగానికి తీరని లోటు అని సంతాపం వ్యక్తం చేశారు.