టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో విశ్రాంతి భవనాలకు ఉన్న పేర్లు మార్చేసింది. వసతి గృహాలకు దాతలు తమ స్వంత పేర్లు పెట్టుకోవద్దంటూ టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది. ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరడంతో వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇందులో భాగంగా వసతి గృహాల పేర్లను మార్చే పనిలో పడింది.