ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. చివరి దాకా ఉత్కంఠ భరితంగా సాగింది మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 213 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 రన్స్ చేసింది. జస్ట్ 3 పరుగుల దూరంలో ఓటమి పాలైంది. దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది.