ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు సమీపంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. కిమ్స్ ఆస్పత్రి సమీపంలో కోడి గుడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. లారీ బోల్తా పడి ఉండడంతో ట్రాఫిక్ నిలిచి పోయిన సమయంలో.. కారును వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీకొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జుగా మారింది.