తిరుమల కిటకిట కాసులు గలగల
NEWS May 04,2025 07:45 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. ఎక్కడ చూసినా భక్త సందోహమే కనిపిస్తోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 84 వేల 113 మంది భక్తులు దర్శించుకున్నారు. 33 వేల 868 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.