కొందరు జడ్జీలు అమ్ముడు పోతున్నారు
NEWS May 03,2025 05:58 pm
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మత బోధకుడు డాక్టర్ కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా జడ్జీలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అందరు జడ్జీలు కాక పోయినా కొందరు న్యాయమూర్తులు అమ్ముడు పోతున్నారని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొన్ని లక్షల ఎకరాలను అప్పనంగా ఇచ్చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.