లెక్కకు మించి ఆస్తులు కలిగిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఈఎన్సీ హరిరామ్ ను శనివారం కూడా విచారణ చేపట్టింది ఏసీబీ. ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. కస్టడీలో భాగంగా నిన్న మొదటి రోజు ఏసీబీ ప్రశ్నలకు సరిగ్గా హరిరామ్ స్పందించ లేదు. దీంతో రెండో రోజు కూడా ఎంక్వయిరీ ప్రారంభించింది. ఇదిలా ఉండగా కేసు నమోదు కావడంతో హరిరామ్ ను సస్పెండ్ చేశారు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి. కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ నుంచి పెద్ద ఎత్తున హరిరామ్ లబ్ది పొందినట్లు ఆరోపణలున్నాయి. అంతే కాకుండా తన బినామీలపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.