తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
NEWS May 03,2025 08:50 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. ఎక్కడ చూసినా భక్త సందోహమే కనిపిస్తోంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది ఈ మహిమాన్విత స్థలం. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 74 వేల 344 మంది భక్తులు దర్శించుకున్నారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.50 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 20 గంటలకు పడుతుందన్నారు.