రేపే స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లు జారీ
NEWS May 03,2025 08:37 am
ప్రతి నెలా మొదటి మంగళవారం మే 6వ తేది స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా మే 4వ తేది ఆదివారం స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా కోరింది.