ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర
NEWS May 03,2025 08:14 am
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో 10 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భాష్యకార్ల ఉత్సవాలు సాత్తుమొరతో ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు స్వామి వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం స్వామి వారికి తిరుమంజనం, ఆస్థానం, సాత్తుమొర నిర్వహించారు. భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంత పరంగా మీమాంస గ్రంథానికి శ్రీభాష్యం పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా ప్రసిద్ధి చెందారు.