పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ నిషేధం
NEWS May 03,2025 07:49 am
భారత, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే నీటి సరఫరాను నిలిపి వేసింది. భారత గగన తలానికి చెక్ పెట్టింది. పాకిస్తాన్ కు చెందిన సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖుల సామాజిక మాధ్యమాల ఖాతాలను, యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు చెందిన వ్యక్తిగత యూట్యూట్ ఛానల్ పై బ్యాన్ విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.