రాష్ట్రంలోని న్యాయవాదుల అందరి సంక్షేమం కోసమే తెలంగాణ బార్ కౌన్సిల్ ఉందని బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కుంచ సునీల్ గౌడ్ అన్నారు. న్యాయవాదుల సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి కొత్తగా ఎఐబీఈ పాస్ అయిన వారితో పాటు, మిగతా సీనియర్ న్యాయవాదులు కూడా ఐదేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలన్నారు. 35 ఏళ్ల లోపు గల న్యాయవాదులు అందరూ వెల్ఫేర్ ఫండ్ చెల్లించి భవిష్యత్ లాభాలకి అర్హత పొందాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు.