అమరావతి 2.0కు ప్రధాని మోడీ శంకుస్థాపన
NEWS May 02,2025 05:22 pm
దేశ ప్రధాని మోదీ శుక్రవారం ఏపీలో పర్యటించారు. అమరావతి 2.0కు మోదీ శంకుస్థాపన చేశారు. రాజధాని పనులు సహా రూ. 58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు మరో రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకూ శంకుస్థాపన చేశారు. మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన హయాంలో దేశం ప్రపంచంలోనే టాప్ లోకి దూసుకు వెళ్లిందన్నారు. ఏపీని ఏఐ, లాజిస్టిక్, ఆధ్యాత్మిక హబ్ గా తయారు చేస్తామన్నారు.