అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నిప్పులు చెరిగారు. భారత్ తో సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తి లేదని అన్నారు. తమ భూభాగంలోని ఉగ్రవాదులను వేటాడేందుకు పాకిస్తాన్ భారత్ తో సహకరించాలని స్పష్టం చేశారు. లేకపోతే బాగుండదన్నారు.