బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నప్పుడు కవితకు ఎందుకు సోయి రాలేదని ప్రశ్నించారు. ఆరోజు మాట్లాడని కవిత ఈరోజు తప్పు జరిగిపోయిందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. సామాజిక తెలంగాణ కోసం కులగణన చేస్తుంటే మీ నాన్న, అన్న ఎందుకు సర్వేలో పాల్గొనలేదని నిలదీశారు.