కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా భావించే తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 57 వేల 863 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 30 మంది తలనీలాలు సమర్పించారు. శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారని వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. సర్వ దర్శనం కోసం 24 గంటలకు పైగా వేచి ఉన్నారని తెలిపారు.