వెన్ను పోటు పొడవడంలో చంద్రబాబు దిట్ట
NEWS May 01,2025 05:44 pm
మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం చంద్రబాబును ఏకి పారేశారు. వెన్నుపోటు పొడవడంలో తనకు తనే సాటి అన్నారు. గతంలో సీఎం సీటు కోసం స్వంత పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాడని, ఇప్పుడు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. మోసం చేయడం, మాట తప్పడం బాబు నైజమన్నారు జగన్. ఆయనను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.