మావోయిస్టులతో చర్చలు జరపండి
NEWS May 01,2025 02:11 pm
ఆపరేషన్ కగార్ పై కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు . వెంటనే ఆపాలని కోరారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. తక్షణమే కూంబింగ్ నిర్వహించడం, కాల్పులు జరపడం ఆపాలని అన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని విన్నవించారు. 2004లో ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులతో శాంతియుతంగా చర్చలు జరిపిందని గుర్తు చేశారు. ఛత్తీస్గఢ్ ,తెలంగాణ బోర్డర్ నుంచి కేంద్ర బలగాలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు.