తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కొలువు తీరాక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి కీలక పోస్టులు లభిస్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల్లో వారికే ప్రయారిటీ ఇస్తుండగా ఐపీఎస్, ఐఏఎస్ లలో కూడా కీలక పదవులు దక్కుతున్నాయి. రిటైర్ అయిన వారికి కూడా అందలం ఎక్కిస్తున్నారు. తాజాగా పదవీ విరమణ చేసిన కమలాహసన్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు సీఎం. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ OSDగా కమలాసన్ రెడ్డి నియమించారు. రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు.