పంజాబ్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ను శాసించాడు. ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా జరిగిన కీలక పోరులో చెన్నై వేదికగా ఐదో ఓటమి చవి చూసింది. చెన్నై పతనాన్ని శాసించాడు. ఒకే ఓవర్ లోయ 36 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. సమిష్టి ఆట తీరుతో పంజాబ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చెన్నై నిర్దేశించిన టార్గెట్ 191 ను 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అయ్యర్ దంచి కొట్టాడు. స్వంత గడ్డపై వరుసగా ఇది ఐదో ఓటమి కావడం విశేషం. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.