మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
NEWS May 01,2025 07:58 am
నేడు, రేపు మహారాష్ట్ర, కేరళ, ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రేపు ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్..ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. కేరళలో అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును జాతికి అంకితం చేయనున్నారు. మే2న ఏపీలో పర్యటించనున్నారు మోదీ. అమరావతిలో రూ.58 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రోడ్డు, రైలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.