సింహాద్రి దుర్ఘటనపై రాజకీయం చేస్తే ఎలా..?
NEWS May 01,2025 07:46 am
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే, వర్షం కారణంగా గోడ తడిసి బలహీనపడి, భక్తులపై కూలిపడింది. ఈ దుర్ఘటనలో కొందరు అక్కడికక్కడే మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి, మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుందన్నారు. క్యూలైన్లను క్రమబద్ధీకరించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసిందన్నారు.