సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృశింహ స్వామి వారి చంధనోత్స వేడుకల సందర్బంగా క్యూలైన్లో ఉన్న భక్తులపై గోడ కూలిన దుర్ఝటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్ గా స్పందించారని చెప్పారు మంత్రి కొలుసు పార్థసారథి. సహాయక చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఈ దుర్ఝటనకు సంబందించిన నివేదికను 72 గంటల్లో అందజేయాలంటూ ముగ్గరు ఉన్నత స్థాయి అధికారులతో విచారణ కమిషన్ ను నియమించడం జరిగిందన్నారు. ఈ దుర్ఝటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు తెలిపారు.