హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఏవీ ఆనంద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 147 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చాలా పోలీస్ స్టేషనులకు కొత్త ఇన్స్పెక్టర్లను నియమించారు. 42 పోలీస్ స్టేషన్లకు కొత్త ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ పీఎస్ లలో కూడా కొత్త వారిని కేటాయించడం పట్ల విస్మయానికి గురయ్యారు.