సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనంటే కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. ఆయనకు నా పేరు ఎత్తే ధైర్యం లేదన్నారు. మొదటి 10 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపుకు అప్పజెప్పినట్టు అయిందన్నారు. తాను చెడ్డ కోతి వనమల్లె చెరిచినట్లు కేసీఆర్ కుటుంబమంతా తెలంగాణను దోచుకున్నారంటూ ఆరోపించారు. తాను మాట ఇచ్చానంటే తప్పనని అన్నారు రేవంత్ రెడ్డి. ఎక్కడా ఇంత వరకు తాను మాట తప్పినట్లు శత్రువులు కూడా ఆరోపణ చేయలేదన్నారు.