సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. ఈ ఘటనలో గాయపడిన వారికి విశాఖ కేజీ హెచ్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. పోలీసులు, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 25 లక్షల సాయం అందజేస్తామన్నారు.