జాతీయ భద్రతా సలహా బోర్డు ప్రకటన
NEWS Apr 30,2025 04:06 pm
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది. చైర్మన్ గా ఆర్ అండ్ ఏ డబ్ల్యూ మాజీ చీఫ్ అలోక్ జోషీని నియమించింది. సభ్యులుగా మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ జనరల్ ఎకే సింగ్, రియల్ అడ్మిరల్ మాంటీ ఖన్నా, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ బి. వెంకటేశ్ వర్మ, రిటైర్డ్ ఐపీఎస్ లు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్ లను నియమించింది.