సింహాచలం అప్పన్న నృసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన భక్తులకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ప్రభుత్వ పరంగా పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత. వారి కుటుంబంలో ఒకరికి సర్కార్ ఉద్యోగం ఇస్తామన్నారు. తక్షణమే సాయం అందజేస్తామని ప్రకటించారు. ప్రతిపక్షం రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జరిగిన ఘటనపై సీఎం త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. నివేదిక వచ్చేసరికి 2 రోజుల సమయం పడుతుందన్నారు.