ఢిల్లీ క్యాపిటల్స్ కు కోల్ కతా రైడర్స్ ఝలక్
NEWS Apr 30,2025 08:34 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అన్ని జట్లు అద్భుతంగా ఆడుతున్నాయి. చివరకు ప్లే ఆఫ్స్ కు ఏ జట్లు చేరుకుంటాయనేది ఉత్కంఠ రేపుతోంది. తాజాగా ఢిల్లీ వేదికగా స్వంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ ఇచ్చింది కోల్ కతా నైట్ రైడర్స్. సమిష్టిగా రాణించడంతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. 14 రన్స్ తేడాతో ఓడించింది. కేకేఆర్ తరపున రఘువంశీ, రింకూ సింగ్ కీలక పాత్ర పోషించారు. బౌలింగ్ పరంగా వరుణ్ చక్రవర్తి, సునీల్ సరైన్ అద్భుతమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. కోలుకోలేని దెబ్బ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 204 రన్స్ చేసింది. అనంతరం ఛేదనలో చతికిల పడింది. 9 వికెట్లు కోల్పోయి 190 రన్స్ కే పరిమితమైంది.