పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇది సినిమా కాదని ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదవడానికి అంటూ ఎద్దేవా చేశారు. మీ మోడీ మెప్పు పొందాలనుకుంటే ఆయన గురించి సినిమాలు తీసుకో అంతేకానీ ఎవరు ఏది రాసిస్తే అది చదవకంటూ హితవు పలికారు. దేశ సరిహద్దులో నుండి 100 కిలోమీటర్ల లోపలికి చొరబడి ప్రజలను కాల్చి చంపిన నలుగురు ఉగ్రవాదులను ఇంత వరకు పట్టుకోలేక పోయారంటూ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి హోదాలో ఉన్న నీవు స్థాయికి తగ్గ రీతిలో మాట్లాడితే మంచిదన్నారు.