దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి ఘటనలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదులను గుర్తించింది. నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపింది. టెర్రరిస్టుల్లో ఒకరిని హషీమ్ ముసా అని ప్రకటించింది. తను పాకిస్తాన్ సైన్యంలో మాజీ పారా కమాండోగా పని చేశాడని ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. ప్రస్తుతం తను కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారాడని తెలిపింది. పాక్ కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి తను పని చేస్తున్నాడని వెల్లడించింది.