జైపూర్ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించాడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. కేవలం 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 11 సిక్సర్లతో దుమ్ము రేపాడు. 101 రన్స్ చేసి ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అయితే తను చిన్నప్పుడు ఐపీఎల్ మ్యాచ్ చూసిన సమయంలో తండ్రి తనను ఎత్తుకుని నిలబడిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. 2017లో సీఎస్కే మ్యాచ్ సందర్బంగా చూసేందుకు వచ్చాడు. 8 ఏళ్ల తర్వాత తను మైదానంలో దిగి రికార్డ్ సృష్టించాడు.