మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పదే పదే దుఃఖం వస్తోందంటూ కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తూ నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఆయనను జనం నమ్మే స్థితిలో లేరన్నారు. వరంగల్ సభ దేనికోసం పెట్టారో ఆయనకే తెలియదన్నారు. గతంలో మాట్లాడిందే మళ్లీ మళ్లీ మాట్లాడారు తప్పా ఒక్కటైనా కొత్తగా ఉందా అని ప్రశ్నించారు. మోసం, దగా బీఆర్ఎస్ నైజమన్నారు. ప్రజలు ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి జడుసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.