NDSA యాక్ట్ పార్లమెంట్ ఉభయసభల్లో పాస్ అయినప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు NDSAను కించపరిచేలా మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి లక్షన్నర కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికే తీసుకున్న అప్పుకు ఏడాదికి రూ.16 వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తుమ్మడిహెట్టి దగ్గర నీళ్లు లేవనే మేడిగడ్డకు షిఫ్ట్ చేశామని పచ్చి అబద్దాలు మాట్లాడారంటూ ఆరోపించారు.