తెలంగాణ డీజీపీ రేసులో 8 మంది సీనియర్ ఐపీఎస్‌లు పోటీ పడుతున్నారు. UPSC కి 8 మంది పేర్లను పంపింది ప్రభుత్వం.అర్హతల ఆధారంగా జాబితా నుంచి ముగ్గురి పేర్లను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది UPSC. ఇదిలా ఉండగా ఈసెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు ప్రస్తుత డీజీపీ జితేందర్. ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.