జాతీయ భద్రతపై కీలక సమావేశం
NEWS Apr 29,2025 06:14 pm
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA)లో ప్రస్తుతం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ భద్రతా గార్డ్ (NSG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సరిహద్దు భద్రతా దళం (BSF), అస్సాం రైఫిల్స్ అధిపతులు హోం కార్యదర్శితో రహస్య చర్చలో పాల్గొంటున్నారు. జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి భద్రతా కేబినెట్ కమిటీ (CCS) రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది.