పీఎం మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలన
NEWS Apr 29,2025 06:06 pm
దేశ ప్రధాని మోదీ మే 2వ తేదీన ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మంత్రి నారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. సభా వేదిక, జనం వచ్చే ప్రాంతాలు, వేదిక వద్దకు చేరుకునే రూట్స్ ను చూశారు. ప్రధాని మధ్యాహ్నం 3.25 గంటలకు వస్తారని చెప్పారు. టూర్ కు 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. రేపటి కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. సభకు 5 లక్షల మందికి పైగా ప్రజలు వస్తారని వెల్లడించారు.