తగ్గేదే లేదంటున్న స్మితా సబర్వాల్
NEWS Apr 29,2025 05:36 pm
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ తన తీరు మార్చుకోవడం లేదు. తగ్దేదే లేదంటున్నారు. భగవద్గీతలోని శ్లోకాన్ని ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా కొలువు తీరారు. పదవీ బాధ్యతలు చేపట్టారు. కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన అంటూ ఉదహరించారు. తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వహించానని, పర్యాటక రంగానికి కొత్త ఊపు తీసుకు వచ్చానని తెలిపారు. పెట్టుబడులు భారీగా వచ్చేలా చేశానని పేర్కొన్నారు. మిస్ట వరల్డ్ పోటీలకు మార్గం సుగమం చేశానని స్పష్టం చేశారు. తాను ఎక్కడ ఉన్నా, ఏ శాఖ అప్పగించినా న్యాయం చేస్తానన్నారు.